ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు.
విజయవాడ: ఉద్యోగుల విభజన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారిని కోరారు.
అడిగితేనే చేద్దాం అనుకునే వైఖరి మంచిది కాదని, సమన్యాయం లేని విభజనతో ప్రజల్లో కసి, ఆగ్రహం పెల్లుబికాయని అన్నారు. ఇందుకు అప్పటి అధికార కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయాలని, దక్షిణాదిలో ఆదాయం సమకూర్చుకోవటంలో పొరుగురాష్ట్రాల స్థాయికి చేరేదాకా ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం సహాయపడాలని కోరారు.