సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం | plastic rice in more super market - a consumer protest | Sakshi
Sakshi News home page

సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం

Nov 29 2015 4:45 PM | Updated on Mar 22 2019 7:18 PM

సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం - Sakshi

సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం

నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ మోసం వెలుగుచూసింది.

నగరంలోని ఎల్బీనగర్  పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ మోసం వెలుగుచూసింది. బండ్లగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బండ్లగూడ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ సూపర్ మార్కెట్ నుంచి ఆదివారం 25 కేజీల బియ్యం బస్తాను కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి అన్నం వండి చూసి నిర్ఘాంతపోయాడు.

గిన్నెలో అన్నానికి బదులు ప్లాస్టిక్ రేపర్ ఉండటంతో.. అవాక్కయిన శ్రీనివాస్ ఆ బియ్యం బస్తాతో సూపర్ మార్కెట్ వద్దకు చేరుకొని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యం ఇచ్చినందుకు సూపర్ మార్కెట్  ముందు ఆందోళన చేశాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement