అత్తాపూర్ మూసీ కాలువ సమీపంలో ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహం
Dec 4 2016 9:53 AM | Updated on Mar 22 2019 7:18 PM
హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ మూసీ కాలువ సమీపంలో ప్లాస్టిక్ డ్రమ్ములో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదివారం ఉదయం మూసీ కాలువ వైపు వెళ్లిన స్థానికులకు డ్రమ్ములో మృతదేహం కనిపించింది. భయాందోళనలకు గురైన వారు ఎవరో హత్యచేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి తెచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement