టవరెక్కిన మయూరం | peacock in high tension wires | Sakshi
Sakshi News home page

టవరెక్కిన మయూరం

Jun 28 2015 4:13 PM | Updated on Sep 3 2017 4:32 AM

టవరెక్కిన మయూరం

టవరెక్కిన మయూరం

ప్రాణం తీసుకోవాలనుకున్న వాళ్లో.. బెదిరించాలనుకున్న వాళ్లో.. టవరెక్కడం ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం.

హైదరాబాద్: ప్రాణం తీసుకోవాలనుకున్న వాళ్లో.. బెదిరించాలనుకున్న వాళ్లో.. టవరెక్కడం ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం.. కానీ అనుహ్యంగా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం జాతీయపక్షి నెమలి టవరెక్కింది. ఈ అరుదైన సంఘటనకు నగరంలోని గాజులరామారం వేదికైంది. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి జన సంచారంలోకి వచ్చిన నెమలిని కాకులు తరమడంతో.. ప్రాణరక్షణ కోసం మేస్త్రీ నగర్‌లోని హైటెన్షన్ టవరెక్కింది.

ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించడానికి స్థానికులు ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హైటెన్షన్ వైర్లు కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు గంటల నుంచి ప్రాణాలకోసం పోరాడుతున్న మయూరం ప్రస్తుతం ఒక టవర్ నుంచి మరో టవర్ పైకి దూకూతోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement