శివ శంకర్‌ మృతి పట్ల పవన్‌ సంతాపం

శివ శంకర్‌ మృతి పట్ల పవన్‌ సంతాపం - Sakshi


హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్‌ మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. రాజకీయ యోధుడైన ఆయన మరణం దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.శివశంకర్‌ రాజకీయ శైలి, వాగ్దాటి మరిచిపోలేనివన్నారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా దేశానికి, తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ప్రజల్లో చిరస్మరనీయులుగా మిగిలిపోతారని అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులను మరచి పోలేనివని పవన్‌ గుర్తుకు చేసుకున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన శివశంకర్‌ మాటల్లో సున్నితమైన విచక్షణ కూడా ఉండేదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించడంలో ఆయన చూపే చొరవ తనని ఎంతగానో ఆకట్టుకొనేదని చెప్పారు. ఈ సందర్భంగా శివ శంకర్‌ కుటుంబసభ్యులకు పవన్‌ సానుభూతి తెలియచేసి శ్రద్ధాంజలి ఘటించారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top