ఎర్రగడ్డ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య | patient suicide in Erragadda hospital | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య

Jun 13 2016 3:37 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఓ రోగి ఆత్మహత్య చేసుకుంది.

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఓ రోగి ఆత్మహత్య చేసుకుంది.ప్రకాశం జిల్లా కొల్లపాలెం గ్రామానికి చెందిన హైమవతి మూడేళ్లుగా ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 

ఆస్పత్రిలో 24 గంటలూ కాపలా ఉండే క్లోజ్డ్ ఫిమేల్ వార్డులో ఈమెతో పాటు మరో 77 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో హైమవతి వార్డులో కిటికీ చువ్వకు చీరతో ఉరి వేసుకుంది. అందరూ ఉండగానే ఆమె ఎలా ఆత్మహత్యకు పాల్పడిందనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement