ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్‌ పాయిజన్‌.. 70 మందికి అస్వస్థత | Food Poisoning At Erragadda Mental Hospital | Sakshi
Sakshi News home page

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్‌ పాయిజన్‌.. 70 మందికి అస్వస్థత

Jun 3 2025 8:00 PM | Updated on Jun 3 2025 9:28 PM

Food Poisoning At Erragadda Mental Hospital

సాక్షి, హైదరాబాద్‌: ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్సెట్టి ఆసుపత్రిని సందర్శించారు.

ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయారు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘటనపై ఆరా తీశారు. ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం 68 మంది రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement