'హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుంది' | palle raghunatha reddy slams kcr over phone tapping issue | Sakshi
Sakshi News home page

'హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుంది'

Jul 30 2015 7:56 PM | Updated on Sep 3 2017 6:27 AM

'హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుంది'

'హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుంది'

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము చెప్పిందే నిజమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము చెప్పిందే నిజమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... తమ ప్రభుత్వం పట్ల తెలంగాణ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఫోన్లు ట్యాప్ చేయలేదని తెలంగాణ మంత్రులు, అధికారులు చెప్తువచ్చారని... ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఈరోజు హైకోర్టులో ఒప్పుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్లు ట్యాప్ చేయకూడదని తెలిపారు. స్వప్రయోజనాలు, రాజకీయ లబ్ధికోసం పక్కరాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇదంతా చేశారని ఆరోపించారు. రామకృష్ణ హెగ్డేకు పట్టిన దుర్గతే కేసీఆర్ పడుతుందని రఘునాథరెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement