దళిత విద్యార్థులకు మనుగడే లేదా? | Or the existence of Dalit students? | Sakshi
Sakshi News home page

దళిత విద్యార్థులకు మనుగడే లేదా?

Jan 20 2016 4:50 AM | Updated on Sep 3 2017 3:55 PM

దళిత విద్యార్థులకు మనుగడే లేదా?

దళిత విద్యార్థులకు మనుగడే లేదా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సృ్మతీ ఇరానీ.........

రోహిత్ ఆత్మహత్యపై ఉప్పులేటి కల్పన ఆవేదన
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సృ్మతీ ఇరానీ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ వైస్ చాన్స్‌లర్ శర్మపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన చిన్నపాటి ఘటనకు రాజకీయ రంగు పులిమి సైంటిస్ట్ కావాలని కలలు గన్న ఓ దళిత విద్యార్థిని బలిగొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులకు సమాజంలో మనుగడే లేదా? అని ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement