పాతబస్తీలో 'ఆపరేషన్ చబుత్రా' | ' Operation cabutra ' in Old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో 'ఆపరేషన్ చబుత్రా'

Dec 30 2015 8:46 AM | Updated on Sep 4 2018 5:07 PM

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఆవారాగా తిరుగుతున్న వారిని కట్టడి చేసేందుకు 'ఆపరేషన్ చబుత్రా' పేరుతో నడుం బిగించారు. మంగళవారం అర్థరాత్రి పాతబస్తీలో బైక్‌లపై షికారు చేస్తున్న 97 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వారిలో 17 మంది బాలురు. అందరినీ ప్రస్తుతం టప్పాచబుత్రాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉంచారు. వారి తల్లిదండ్రులను పిలిపించి అందరికీ కౌన్సెలింగ్ చేయనున్నట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement