స్కాములు.. లీకులు | Social media posts about coalition failures | Sakshi
Sakshi News home page

స్కాములు.. లీకులు

Jun 13 2026 5:13 AM | Updated on Jun 13 2026 5:13 AM

Social media posts about coalition failures

చంద్రబాబు రెండేళ్ల పాలనపై నెటిజన్ల ఫైర్‌ 

కూటమి వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు 

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికల్లో కూటమి వైఫల్యాలను ఎత్తి చూపుతూ పోస్టులు పెడుతున్నారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది. 

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ ప్లాప్, స్కాములు.. లీకులు, డీఎస్సీ అక్రమాలు, రైతులకు వెన్నుపోటు వంటి పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. కూటమి పరిపాలనను వైఎస్సార్‌సీపీ పాలనతో పోల్చుతూ కామెంట్లు పెడుతున్నారు. కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని ఇంతలా అప్పుల పాలు చేసి, ఇన్ని స్కాములకు పాల్పడ్డ చంద్రబాబు అండ్‌కో నేతలపై సామాజిక మాధ్యమాల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement