ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫీజు గడువు పెంపు | Open school SSC and Inter fee Deadline increment | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ ఫీజు గడువు పెంపు

Feb 28 2017 1:17 AM | Updated on Sep 5 2017 4:46 AM

ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించే ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు మార్చి 8లోగా ఫీజు చెల్లించాలని సొసైటీ తెలిపింది. ఒక్కో పేపరుకు రూ. 25 ఆలస్య రుసుముతో 9 నుంచి 13వ తేదీ వరకు, రూ. 50 ఆలస్య రుసుముతో 14 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చని పేర్కొంది.

ఫీజును మీసేవా/ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లోనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్సెస్సీ పరీక్ష కోసం ఒక్కో పేపరుకు రూ. 100, ఇంటర్‌కు ఒక్కో పేపరుకు రూ. 150 చెల్లించాలని సొసైటీ డైరెక్టర్‌ వెంకటేశ్వరవర్మ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement