ఆన్‌లైన్ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు | online betting rocket busted in nizampet | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

Mar 7 2015 6:28 PM | Updated on Sep 2 2017 10:28 PM

హైదరబాద్ నగర శివార్లలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నగర శివార్లలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జరిగింది.

నిజాంపేటలో కొందరు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థావరంపై దాడి చేసి ఇద్దరు బూకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.85 లక్షలు, ఒక కారు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement