స్డేడియం సమీపంలో వ్యక్తి దారుణహత్య | one murdered at surroundings of jyotirao phule stadium | Sakshi
Sakshi News home page

స్డేడియం సమీపంలో వ్యక్తి దారుణహత్య

Jan 7 2017 12:33 PM | Updated on Sep 5 2017 12:41 AM

నగరంలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్‌: నగరంలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక జ్యోతిరావు పూలే స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీసీపీ సాయి శేఖర్‌, ఏసీపీ శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అదిలాబాద్‌ జిల్లా ఇచోద గ్రామానికి చెందిన అశోక్‌(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement