రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తిని దారికాచిన దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.
వికారాబాద్(రంగారెడ్డి): రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తిని దారికాచిన దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం గొట్టిముక్కల గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తిపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
రోడ్డుపై మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.