ఫిబ్రవరిలో విదేశీ భవన్‌కు శంకుస్థాపన: కేటీఆర్‌ | nri bhavan in hyderabad | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో విదేశీ భవన్‌కు శంకుస్థాపన: కేటీఆర్‌

Jan 13 2018 2:01 PM | Updated on Aug 30 2019 8:24 PM

nri bhavan in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి రెండో వారంలో విదేశీ భవన్‌కు శంకుస్థాపన జరగనుందని రాష్ట్ర మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హోమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి ఎన్‌ఆర్‌ఐ శాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. ఏజెంట్లు నెల రోజుల్లో రిజిస్టర్‌ చేసుకోవాలని, లేదంటే అక్రమ ఏజెంట్లుగా గుర్తించి కేసులు పెడతామన్నారు. అంతేగాక పదేపదే అక్రమాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై పీడీ యాక్ట్‌ పెడతామని మంత్రి హెచ్చరించారు. కాగా... గల్ఫ్‌కు మహిళల అక్రమ రవాణాపై పోలీస్‌శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement