దాసరి కుమారుడిపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ | Non Bailable arrest warrant to Dasari son Prabhu | Sakshi
Sakshi News home page

దాసరి కుమారుడిపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Aug 28 2014 6:41 PM | Updated on Oct 17 2018 6:31 PM

దాసరి తారక్ ప్రభు - Sakshi

దాసరి తారక్ ప్రభు

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు తారక్ ప్రభుపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు  కుమారుడు తారక్ ప్రభుపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భరణం చెల్లించలేదని తారక్ ప్రభు భార్య సుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది.

 భరణం బకాయిలను చెల్లించనందుకు ప్రభును అరెస్ట్ చేయాలని గతంలో ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.  ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే భరణం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై  సుశీల హైకోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement