breaking news
Alimony case
-
‘నెలకు రూ. కోటి భరణం’ కేసు ఏమైందంటే..
పద్దెనిమిది నెలల కాపురానికి రూ.12 కోట్ల విలువైన భరణం ఆశించిన భార్య సుప్రీంకోర్టులో భంగపడింది. ఆ మహిళ గొంతెమ్మ కోర్కెలకు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి బ్రేకులేశారు. భర్త ఇవ్వజూపుతున్న ఫ్లాట్‌తో సరిపెట్టుకోవాలని, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగంతో సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని చీఫ్ జస్టిస్ సుతిమెత్తగా ఆ మహిళను మందలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..విడాకుల కోసం ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి మంగళవారం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయి ఆ మహిళను ఉద్దేశించి వేసిన ప్రశ్నలు.. ఆ మహిళ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...చీఫ్ జస్టిస్: మీ డిమాండ్ (భరణం) ఏమిటి?మహిళ: ముంబైలోని అప్పులు, తనఖా ఇబ్బందుల్లేని ఇల్లు, మెయిన్టెన్స్ కోసం రూ.12 కోట్లు.చీఫ్ జస్టిస్: ‘‘... కానీ ఆ ఇల్లు కల్పతరులో ఉంది. ఒకానొక మంచి బిల్డర్‌ది. మీరేమో ఐటీ పర్సన్. ఎంబీఏ కూడా చేశారు. మీలాంటి వాళ్లకు డిమాండ్ ఉంది.. బెంగళూరు హైదరాబాద్‌లలో.. మీరెందుకు ఉద్యోగం చేయకూడదు?’’ ‘‘పెళ్లయిన తరువాత మీ దాంపత్యం 18 నెలలు సాగింది... ఇప్పుడు మీకు బీఎండబ్ల్యూ కూడా కావాలా?’’ పద్దెనిమిది నెలల వైవాహిక జీవితానికి నెలకొ రూ.కోటి చొప్పున కావాలా?’’మహిళ: కానీ అతడు బాగా ధనవంతుడు. నాకు స్కిజోఫ్రెనియా ఉందని, వివాహం రద్దు చేయాలని అతడే కోరాడు.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ (భర్త తరఫు న్యాయవాది): ఆమె కూడా ఉద్యోగం చేయాలి. అన్నీ ఇలా డిమాండ్ చేయడం సరికాదు.మహిళ: మైలార్డ్ నేను స్కిజోఫ్రెనియా బాధితురాలి మాదిరిగా కనిపిస్తున్నానా?చీఫ్ జస్టిస్: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయండి. అయితే ఒకటి అర్థం చేసుకోండి. మీరు అతడి తండ్రి ఆస్తి కోరలేరు!కొంత సమయం తరువాత మంగళవారం బెంచ్ మళ్లీ విచారణ చేపట్టినప్పుడు...చీఫ్ జస్టిస్: ఆదాయపన్ను పత్రాలెక్కడ? మహిళ: ఇక్కడున్నాయి.సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: అన్ని పత్రాల కాపీ ఇవ్వండి... చూశారా 2015- 16లో ఆదాయం ఎక్కువ ఉంది. అప్పట్లో అతడు ఉద్యోగం చేసేవాడు.చీఫ్ జస్టిస్: 2015 - 16లో ఆదాయం ఎంత?సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: రెండు కోట్ల యాభై లక్షలు, కోటి బోనస్. ఇతర వ్యాపారాలు చేసినట్లు ఆరోపణలేవీ లేవు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని గురించి మాట్లాడేందుకు ఏమీ లేదు. తాను (మహిళ) ఆక్రమించుకున్న ఫ్లాట్‌కు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది.చీఫ్ జస్టిస్: అవును అవును. ముంబైలో అన్ని రకాల ప్రదేశాలతో డబ్బు చేసుకోవచ్చు. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్: తాను కోరుకుంటున్న బీఎండబ్ల్యూ కారు కూడా పదేళ్ల పాతది. ఎప్పుడో పాడుపడింది. చీఫ్ జస్టిస్: మీకు (మహిళను ఉద్దేశించి) తనఖా ఇబ్బందుల్లేని ఫ్లాట్ లభిస్తుంది అంతే. బాగా చదువుకున్నా ఉద్యోగం చేయకపోవడం మీ సొంత నిర్ణయం. కేసులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాం.మహిళ: నా భర్త న్యాయవాదిని ప్రభావితం చేశారు...చీఫ్ జస్టిస్: ఎవరిని? మీకు లభిస్తున్న ఫ్లాట్‌తో సంతృప్తి పడితే మేలు. లేదంటే అతడు ఇవ్వజూపుతున్న రూ.నాలుగు కోట్లు తీసుకుని మంచి ఉద్యోగం చూసుకోండి.మహిళ: వారు నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నాకు ఏ ఉద్యోగం వస్తుంది?చీఫ్ జస్టిస్:... వాటన్నింటినీ మేము రద్దు చేస్తాం! మీరు అంతంత చదువులు చదువుకున్నారు. మీ కోసం మీరు అడుక్కోకూడదు. సొంతంగా సంపాదించుకుని తినాలి! మ్యాటర్ ఎండ్స్! ఆర్డర్స్ రిజర్వ్డ్!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
భర్త కనుపాప అలసి.. న్యాయం కోసం ఎదురు చూపులు..
భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చా? చట్టాలు అందుకు సమ్మతిస్తాయా?. పిల్లల్ని మాత్రమే చదివించాలని.. భార్యలను చదివించవద్దని సోషల్ మీడియాలో ఆ మధ్య ప్రచారం ఎందుకు నడిచింది?. భరణానికి.. ఈ ప్రచారానికి అసలు సంబంధం ఏంటి?.. జ్యోతి-అలోక్ కేసు సంచలన తీర్పునకు వేదిక కాబోతోందా?. ఇదంతా తెలియాలంటే ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్లాల్సిందే.. జ్యోతి మౌర్య ఉత్తర ప్రదేశ్‌లో పీసీఎస్ అధికారిణి. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే(శానిటేషన్ డిపార్ట్మెంట్లో 4వ కేడర్ ఉద్యోగి). అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన భార్య నుంచి భరణం కోరుతూ ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య జ్యోతి సంపాదన తన కంటే చాలా ఎక్కువని, పైగా తనకున్న అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని భరణం ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాడతను.గతంలో ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జ్యోతి మౌర్యకు నోటీసులు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగష్టు 8వ తేదీన జరగనుంది. అయితే ఈ కేసు ఇప్పటికిప్పుడే వార్తల్లోకి ఎక్కింది కాదు. బాగా చదివించిన భార్య తనను మోసం చేసి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందుంటూ చాన్నాళ్ల కిందట వైరల్ అయిన కథనం తాలుకాదే..!పారిశుద్ధ్య కార్మికుడైన అలోక్ మౌర్యకు 2010లో జ్యోతి అనే యువతితో వారణాసి చిరైగావ్ గ్రామంలో జరిగింది. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. డిగ్రీ చేసి ఇంటి వద్దే ఖాళీగా ఉంటోంది. దీంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అలోక్ ఆమెను ప్రొత్సహించాడు. అలా ఆమె కష్టపడి 2015లో పీసీఎస్(Provincial Civil Services) పరీక్షలు రాసి 16వ ర్యాంకుతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ జాబ్ దక్కించుకుంది. అప్పటి నుంచి జౌన్పూర్, కౌశంబి, ప్రతాప్‌ఘడ్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆమె విధులు నిర్వహించింది. ఆ జంటకు 2015లో కవల పిల్లలు పుట్టారు.2020లో వీళ్ల కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన హోం గార్డ్ కమాండెంట్ మనీష్ దుబేతో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో అలోక్-జ్యోతి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్నోలోని ఓ హోటల్లో ఈ ఇద్దరినీ రెడ్‌హ్యాండెండ్‌గా అలోక్ పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది జ్యోతి. ఈ క్రమంలో.. 2023లో తనను హత్య చేసేందుకు తన భార్య జ్యోతి కుట్ర పన్నుతుందంటూ అలోక్ పోలీసులను ఆశ్రయించాడు. అదే సమయంలో జ్యోతి కూడా తనను కట్నం కోసం భర్త, అతని కుటుంబం వేధిస్తోందంటూ కేసు పెట్టారు. ఈలోపు జ్యోతి అవినీతి బాగోతమంటూ వాట్సాప్ చాటింగ్, డైరీకి సంబంధించిన పేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయి. అప్పుడే తనకు న్యాయం కావాలంటూ అలోక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో నెట్లో బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. ఈ కేసు నేపథ్యంలో ‘‘బేటీ పడావో.. బీవీ నహీ(పిల్లలను చదివించండి.. భార్యలను కాదు)’’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో చర్చ నడిచింది. ఏకంగా కొందరు ఈ లైన్ మీద బాణీలు కట్టి యూట్యూబ్‌లలో వదిలారు. సరిగ్గా అదే సమయంలో ఓ కులాన్ని కించపరిచేలా జ్యోతి చేసిన ప్రసంగం నెట్టింట మంట పుట్టించింది. జ్యోతి క్షమాపణలు చెప్పాలంటూ భీమ్ ఆర్మీ నిరసలకు దిగింది. భర్త భరణానికి అర్హుడేనా?హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 24 ప్రకారం.. పోషించుకోలేని పరిస్థితుల్లో భార్యభర్తల్లో ఎవరికైనా సరే భరణం పొందే అర్హత ఉంది. ఈ లెక్కన ఈ భరణం పిటిషన్.. రాబోయే రోజుల్లో చర్చనీయాంశమయ్యే అవకాశం లేకపోలేదు.ప్రొఫెషనల్‌గానూ..వ్యక్తిగత జీవితంతోనే కాదు.. వృత్తిపరంగానూ జ్యోతి మీద విమర్శలు ఉన్నాయి. ఇంతకు ముందు బరేలీ సెమీఖేదా షుగర్ మిల్కు ఆమె జనరల్ మేనేజర్‌గా పని చేశారు. ఆమె హయాంలో వివిధ కార్యకలాపాల జాప్యంతో చెరుకు రైతులు నిరసనలకు దిగారు. ఇటు రైతులే కాదు, అటు తోటి అధికారులు ఆమె వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేశారు. దీంతో.. 2023లో ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. లక్నో హెడ్ క్వార్టర్స్‌కు ఆమెను బదిలీ చేసినప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి బాధ్యతలను అప్పజెప్పకపోవడం గమనార్హం. -
‘మీకెందుకివ్వాలమ్మా భరణం?’.. మహిళ కేసులో హైకోర్టు కీలక తీర్పు!
ఢిల్లీ: భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నారు. వివాహం కాకముందు ఉద్యోగం చేశారు. భారీ మొత్తంలో వేతనం తీసుకున్నారు. అలాంటి మీకు భరణం ఎందుకివ్వాలి? అని ప్రశ్నించింది. ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్న పిటిషినర్‌కు భరణం ఇచ్చే అంశాన్ని ప్రోత్సహించడం లేదని వ్యాఖ్యానించింది. వెంటనే, ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. వాళ్లిద్దరూ భార్య, భర్తలు. 2019 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. అయితే, సింగపూర్‌కు వెళ్లిన తనని.. తన భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారనే కారణంతో భార్య ఫిబ్రవరి 2021లో భారత్‌కు తిరిగి వచ్చారు. తన బంగారాన్ని ఆమ్మి స్వదేశానికి వచ్చినట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బంధువులు ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి, తన భర్త నుంచి భరణం కావాలని కోరుతూ జూన్ 2021లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో తన భర్త భారీ మొత్తంలో సంపాదిస్తూ లగ్జరీగా బతుకుతున్నారని, తనకు ఎలాంటి సొంత ఆదాయం లేదని, భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఆ పిటిషన్‌పై జస్టిస్ చంద్రదారి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 125 ను సమర్ధిస్తూనే ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉండి, ఖాళీగా ఉండే మహిళల విషయంలో ఇది వర్తించదు. అందుకే, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న భార్య.. భర్త నుంచి భరణం పొంది ఖాళీగా ఉండడాన్ని సహించదు. కాబట్టి, కోర్టు ఈ కేసులో తాత్కాలిక భరణాన్ని ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే పిటిషనర్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా, వివాహానికి ముందు దుబాయ్‌లో మంచి ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది. ఆమె చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని కోర్టు భావిస్తోంది. ఆమె.. తన భర్త ఇచ్చే తాత్కాలిక భరణం మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్.. లేటు వయసులో లేని పోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ప్రోగ్రామ్ లో పాట పాడుతూ మహిళా అభిమానికి లిప్ కిస్ ఇచ్చి కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇప్పుడు మొదటి భార్య వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?)తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఉదిత్ నారాయణ్.. 69 ఏళ్లొచ్చినా ఇంకా తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నారు. సినిమా సాంగ్స్ కూడా పాడుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మొదటి భార్య రాంజన ఇప్పుడు ఈయనపై కోర్టులో కేసు వేసింది. ఉదిత్ నారయణ్.. తనకు సంబంధించిన భూమిని తనకు చెప్పకుండా అమ్మేశాడని, అందులో తనకు దక్కాల్సిన రూ.11 లక్షల్ని తీసేసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి తనకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగానే ఉదిత్.. ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. తొలుత బుకాయించాడు గానీఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. అవి చెల్లిస్తున్నాడు కూడా. తాజాగా రాంజన మరోసారి కోర్టు మెట్లక్కెడంతో ఉదిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలు
న్యూఢిల్లీ: విడాకుల అనంతరం మహిళకు ఇచ్చే ‘భరణం’ విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న వి వర్లేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవనభృతిని నిర్ణయించడానికి ముందు ఎనిమిది అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.కుమారుడి కోసం కోటి రూపాయలుప్రవీణ్ – అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం కోటి రూపాయలు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్లయిన తర్వాత ఆరేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్లు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు, విభేదాలు తలెత్తాయనే ఆరోపణలు వీరి పెళ్లికి కారణమయ్యాయి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించారు. మరోవైపు ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదని అంజు ఆరోపించింది. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రా యపడింది. ఆ తర్వాత షరతులను పేర్కొంటూ కో ర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ భరణం ఆర్డర్ చర్చనీయాంశమైంది.కోర్టు సూచించిన ఎనిమిది సూత్రాలు1. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు2. భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు3. ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం4. ఆదాయ మార్గాలు, ఆస్తులు5. అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు6. కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయపోరాటానికి సహేతుకమైన మొత్తం8. మెయింటెనెన్స్ అలవెన్స్‌తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు -
ఆ విడాకుల విలువ అక్షరాల యాభై వేల కోట్లు!
Russian Billionaire Vladimir Costly Divorce Case News: రష్యన్ బిలియనీర్ వ్లాదిమిర్ పొటానిన్ అత్యంత ఖరీదైన విడాకులతో వార్తల్లోకెక్కాడు. ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన(మన కరెన్సీలో అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది) విడాకుల భరణం కోరుతూ ఆయన భార్య(మాజీ) కోర్టుకెక్కింది. తద్వారా జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ తర్వాత అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా రికార్డుల్లోకి ఎక్కింది ఇది. వ్లాదిమిర్ పొటానిన్.. రష్యాలోనే రెండో రిచ్చెస్ట్ పర్సన్. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన సంపద 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది. 31 ఏళ్ల కాపురం తర్వాత వ్లాదిమిర్ పొటానిన్, నటాలియా పొటానినా విడాకులకు సిద్ధమయ్యారు. అయితే ఖనిజం ఫ్యాక్టరీ ఎంఎంసీ నోరిల్స్క్ నికెల్ పీఎస్జేసీలో వ్లాదిమిర్‌కు చెందిన వాటా నుంచి యాభై శాతం భరణంగా ఇప్పించాలంటూ మాజీ భార్య నటాలియా లండన్ కోర్టుకు ఎక్కింది. ఆ విలువ ఏడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. అంతేకాదు ఆయన వ్యాపారాల్లో ఆ విలువ మూడో వంతు పైనే ఉంటుంది. ఇలాంటి హైప్రొఫైల్ కేసులకు తీర్పులు ఇవ్వడంలో లండన్ కోర్టుకు ఘన చరిత్రే ఉంది. గతంలో బిలియనీర్ ఫర్ఖద్ అఖ్హ్మెదోవ్ విడాకుల కేసులో 450 మిలియన్ పౌండ్ల భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది కూడా. ఇంతకు ముందు నటాలియా పొటానీనా కింది కోర్టులో 84 మిలియన్ డాలర్లు కోరగా.. 40 మిలియన్ డాలర్లకు జడ్జి తీర్పు ఇచ్చారు. కానీ, పొటానీనా మాత్రం భారీ భరణం కోరుతూ ఈసారి లండన్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పోటానిన్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మాక్మెకంజీ స్కాట్‌కు 36 బిలియన్ డాలర్లు విడాకుల భరణం చెల్లించగా.. బిల్‌గేట్స్, మిలిండాకు 26 బిలియన్ డాలర్ల భరణం చెల్లించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో మూడో బిలియనీర్‌గా ఖరీదైన విడాకుల జాబితాలో వ్లాదిమిర్ నిలుస్తాడా? లేదా? అన్నది తెలియడానికి కొంత టైం పడనుంది. -
దాసరి కుమారుడిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు తారక్ ప్రభుపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భరణం చెల్లించలేదని తారక్ ప్రభు భార్య సుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. భరణం బకాయిలను చెల్లించనందుకు ప్రభును అరెస్ట్ చేయాలని గతంలో ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే భరణం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై సుశీల హైకోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది.