నిఫ్ట్ సలహా కమిటీ ఏర్పాటు | NIFT advisory committee formed | Sakshi
Sakshi News home page

నిఫ్ట్ సలహా కమిటీ ఏర్పాటు

Sep 15 2016 3:59 AM | Updated on Sep 4 2018 5:24 PM

నిఫ్ట్ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి సలహా కమిటీని నియమించింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రస్థాయి సలహా కమిటీని నియమించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు, సంబంధిత పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉంటారు.

Advertisement
 
Advertisement
Advertisement