కట్నం వేధింపులకు నవవధువు బలి | New bride's dowry harassment to Death | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు నవవధువు బలి

Sep 9 2015 3:00 AM | Updated on Sep 3 2017 9:00 AM

సుకన్య (ఫైల్)

సుకన్య (ఫైల్)

కట్నం వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది...

మలేసియాటౌన్‌షిప్: కట్నం వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ ఎస్‌ఐ జానయ్య, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా కొత్తపాలానికి చెందిన శ్రీనివాసరావు, శకుంతల దంపతుల కుమార్తె సుకన్య (28)కు అదే జిల్లాకు చెందిన మహేష్ (32)తో 14 నెలల క్రితం పెళ్లైంది.  గుంటూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మహేష్ ఉద్యోగం చేస్తున్నాడు. సుకన్య తల్లిదండ్రులు పెళ్లి సమయంలో రూ.5 లక్షలు కట్నం ఇచ్చారు. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మూడు నెలల క్రితం సుకన్య ప్రస్తుతం నిజాంపేట రోడ్డులో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. కాగా, మంగళవారం మధ్యాహ్నం తన బెడ్‌రూంలోకి వెళ్లిన సుకన్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుండటంతోనే సుకన్య ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement