సీమాంధ్రలో 22శాతం తెలగ, బలిజ, కాపులు ఉన్నారని ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా తమ ఓట్లే కీలకమని తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక, తెలగ, బలిజ, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ దాసరి రామ్మోహన్‌రావు అన్నారు
తెలగ, బలిజ, కాపు జేఏసీ డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో 22శాతం తెలగ, బలిజ, కాపులు ఉన్నారని ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా తమ ఓట్లే కీలకమని తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక, తెలగ, బలిజ, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ దాసరి రామ్మోహన్‌రావు అన్నారు. సీమాంధ్రలో అన్ని పార్టీలు కాపులకు 40 ఎమ్మెల్యే, ఐదు ఎంపీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు కేటాయించకపోతే తమ వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకుంటామని శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.