'ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు' | National wide Protest will be organised on Dec 19, says Ramachandra khuntia | Sakshi
Sakshi News home page

'ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు'

Dec 15 2015 1:04 PM | Updated on Aug 15 2018 2:51 PM

నరేంద్ర మోదీ సర్కార్ తీరుకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని ఏఐసీసీ నేత రామచంద్ర కుంతియా పేర్కొన్నారు.

♦ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి
♦ బీజేపీ నేతలకు ఒక విధానం.. ప్రతిపక్ష పార్టీలకు మరో విధానమా?: ఏఐసీసీ నేత కుంతియా
♦ అవినీతి కేసులున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎం ఇళ్లపై దాడులు ఎందుకు జరగడంలేదు?: రామచంద్ర కుంతియా


హైదరాబాద్/ఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ తీరుకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని ఏఐసీసీ నేత రామచంద్ర కుంతియా పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

అవినీతి కేసులున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల ఇళ్లపై ఎందుకు సీబీఐ దాడులు జరగడం లేదని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఒక విధానం.. ప్రతిపక్ష పార్టీలకు మరో విధానమా? అంటూ ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement