టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు | national conference of public service commission chairmen | Sakshi
Sakshi News home page

టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

Feb 1 2016 3:14 PM | Updated on Sep 3 2017 4:46 PM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు చైర్మన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. చిలుకూరులోని ప్రగతి రిసార్ట్స్లో నిర్వహించనున్న ఈ 18వ జాతీయ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సదస్సు సందర్భంగా సిలబస్, పరీక్ష విధానం, నూతన సాంకేతిక పద్దతులపై చర్చతో పాటు టీ హబ్లో ఐటీ కంపెనీలతో సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమీక్ష ఉంటుందని చక్రపాణి వెల్లడించారు. యూపీఎస్సీ చైర్మన్తో పాటు అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు హాజరవుతున్న ఈ సదస్సు గవర్నర్ ప్రసంగంతో ముగియనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement