విద్యార్థి తండ్రిపై కళాశాల సిబ్బంది దాడి | narayana college staff attack on student's father | Sakshi
Sakshi News home page

విద్యార్థి తండ్రిపై కళాశాల సిబ్బంది దాడి

Nov 27 2016 6:45 PM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్‌ను అడగటానికి వెళ్లిన తండ్రిపై కూడా దౌర్జన్యం చేశారు కళాశాల సిబ్బంది

నాగోలు(హైదరాబాద్‌సిటీ): టిఫిన్ కోసం బయటకు వెళ్లిన విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్‌ను అడగటానికి వెళ్లిన తండ్రిపై కూడా దౌర్జన్యం చేయడంతో బాధితులు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితుల కథనం ప్రకారం... కర్నూలుకు చెందిన కె.వంశీ బండ్లగూడ నారాయణ కళాశాలలో లాంగ్‌టర్మ్‌లో మెడిసిన్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం వంశీ టిఫిన్ కోసం బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంకట్ విద్యార్థి వంశీని గదిలో బంధించి చితకబాదాడు. ఈ విషయం వంశీ తన తండ్రి కె.నర్సింహుడుకు చెప్పగా ఆదివారం వచ్చి సంఘటనపై ప్రిన్సిపాల్ వెంకట్‌ను అడిగారు. వివరాలు అడుగుతున్న తండ్రిపై కూడా కళాశాల సిబ్బంది దౌర్జన్యం చేసి దాడికి యత్నించారు. దీంతో బాధితులు ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement