దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు

More amenities for handicapped - Sakshi

18 నుంచి అమలు: రైల్వే సీపీఆర్వో

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగులు, వయోధికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో వీల్‌చైర్లే వినియోగంలో ఉన్నాయి. ట్రైన్‌ దిగిన తరువాత స్టేషన్‌ బయటకు వెళ్లేందుకు, స్టేషన్‌ నుంచి ట్రైన్‌ వద్దకు వెళ్లేందుకు మాత్రమే ఇవి సౌకర్యంగా ఉన్నాయి. ఇక నుంచి నేరుగా ట్రైన్‌లోకి వెళ్లేందుకు వీలైన ఫోల్డింగ్‌ ర్యాంప్‌ను దివ్యాంగులైన ప్రయాణికుల కోసం వినియోగంలోకి తేనున్నారు.

గుంటూరు–వికారాబాద్‌ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో మొట్టమొదట ఈ నెల 18 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. ట్రైన్‌ డోర్‌ నుంచి నేరుగా లోపలికి వెళ్లేందుకు, ట్రైన్‌ లోంచి నేరుగా బయటకు వచ్చేందుకు వీలుగా ఇవి పనిచేస్తాయి. మొదట పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లోని థర్డ్‌ ఏసీ బోగీలో వీటిని వినియోగిస్తారు. ఆ తరువాత దశలవారీగా అన్ని రైళ్లకూ విస్తరించనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top