ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య | mla r krishnaiah demands for special status | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య

Sep 6 2016 7:50 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఆర్ కృష్ణయ్య

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కె. వేణుమాధవ్ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం విద్యానగర్‌లో జరిగింది. 

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.... ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, నాయకులు గుజ్జ కృష్ణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement