మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు | Mission Kakatiya scheme to Rs .2,255 crore : Telangana Budget 2016-17 | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు

Mar 15 2016 2:24 AM | Updated on Sep 3 2017 7:44 PM

మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు

మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే...

గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే నిధులను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.172 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి మొత్తంగా రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, ఇదే మిషన్ కాకతీయలో పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్‌బండ్‌లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు.

ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement