పెళ్లి మీది.. హడావుడి మాది | Matrimony is impressive Expo -2014 | Sakshi
Sakshi News home page

పెళ్లి మీది.. హడావుడి మాది

Nov 22 2014 12:11 AM | Updated on Sep 2 2017 4:52 PM

పెళ్లి మీది.. హడావుడి మాది

పెళ్లి మీది.. హడావుడి మాది

భారత్ మ్యాట్రిమోనీ ఆధ్వర్యంలో తెలుగు మ్యాట్రిమోనీ ఎక్స్‌పో-2014 పేరిట రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది.

ఆకట్టుకుంటున్న మ్యాట్రిమోనీ ఎక్స్‌పో-2014

 రాయదుర్గం:  భారత్ మ్యాట్రిమోనీ ఆధ్వర్యంలో తెలుగు మ్యాట్రిమోనీ ఎక్స్‌పో-2014 పేరిట రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పెళ్లి పత్రికలు మొదలుకొని  వెడ్డింగ్ హాల్స్, కేటరర్స్, బ్రైడల్ మేకప్, ఆభరణాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వెడ్డింగ్ వేర్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, సన్నాయి మేళం వంటి 87 స్టాళ్లను అందుబాటులో ఉంచారు. మూడు రోజులపాటు ఈ ఎక్స్‌పో కొనసాగనుంది. తమ ఇళ్లలో పెళ్లి చేయాలనుకునే వారికి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే చోట పొందడానికి అవకాశం ఉండటంతో సంద ర్శకుల సంఖ్య గణనీయంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.  

ఎక్స్‌పోను ప్రారంభించిన బనగానపల్లి ఎమ్మెల్యే

మ్యాట్రిమోనీ ఎక్స్‌పో-2014ను కర్నూల్ జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే, జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ యజమాని బి.సి జనార్దన్‌రెడ్డి  ప్రారంభించారు. కార్యక్రమంలో మ్యాట్రిమోనీ సంస్థ బిజినెస్ హెడ్ లలిత్ మస్తా, రీజినల్ మేనేజర్ అనిల్‌కుమార్, ఏపీ హెడ్ సయ్యద్ అజహర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement