TECH టమారం..
క్లిక్ చేయడమే కాదు, షాక్ కూడా ఇస్తాయి ఈ కెమెరాలు! సైజు చూసి తక్కువ అంచనా వేయకండి. ఈ మినీ కెమెరా గాడ్జెట్లు చేసే పని మాత్రం పక్కా ప్రొఫెషనల్. తక్కువ ధరలో ఎక్కువ క్రియేటివిటీ కావాలంటే వీటికి, మీ కార్ట్‌లో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిందే!
సీసీ కెమెరాకు మినీ తమ్ముడు!
కరెంట్ పోయిందేమో... తీగలు వేయాలేమో... పెద్ద సీసీ కెమెరా పెట్టాలేమో... ఇలాంటి టెన్షన్లన్నింటికీ గుడ్‌బై చెప్పేయండి! ఈ మినీ వైఫై కెమెరా ఉంటే చాలు. అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది కానీ, ఇంటిపై నిఘా మాత్రం పెద్ద సీసీ కెమెరాలా ఉంచుతుంది. ఎక్కడైనా పెట్టేయొచ్చు; మొబైల్‌తో కనెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచైనా ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోచ్చు. కదలిక కనిపించగానే వెంటనే మీ ఫోన్‌కు సమాచారం పంపిస్తుంది. చీకట్లో కూడా నైట్ విజన్ తో స్పష్టంగా రికార్డు చేస్తుంది. పిల్లలు, పెంపుడు జంతువులు లేదా ఇంటి భద్రత కోసం సింపుల్‌గా వాడుకునే పోర్టబుల్ సీసీ కెమెరా ఇదే. ధర కేవలం రూ. 600 మాత్రమే!
పాకెట్‌లోనే స్టూడియో!
ఫోన్ కెమెరా బాగానే ఉంటుంది... కానీ వెలుతురు లేకపోతే ఫొటో వెలవెలబోతుంది! అందుకే, ఈ చిన్న మాగ్నెటిక్ సెల్ఫీ లైట్ మీ జేబులోనే తిరిగే మినీ స్టూడియోలా పనిచేస్తుంది. మొబైల్‌కు టక్కున అతుక్కుని... మీ ముఖంపై సమంగా వెలుతురు పడేలా చేస్తుంది. ఇక సెల్ఫీలు, రీల్స్, వ్లాగ్స్, వీడియో కాల్స్... ఏదైనా ప్రొఫెషనల్ లుక్‌లో కనిపిస్తాయి.
ఇందులో మూడు రకాల లైటింగ్ మోడ్స్, కావాల్సినంత బ్రైట్‌నెస్, 360 డిగ్రీలు తిరిగే డిజైన్ , 270 డిగ్రీలు మడిచే సౌకర్యం ఉన్నాయి. అంతేకాదు, చిన్న అద్దం కూడా ఉండటంతో మేకప్ టచప్ కోసం మరో అద్దం వెతకాల్సిన అవసరం లేదు. ఫోన్ స్టాండ్‌లాగానూ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే గంటల తరబడి పనిచేస్తుంది. ధర రూ. 1,800.
ఎగిరేది పక్షి కాదు... డ్రోనే!
ట్రావెల్‌కు వెళ్లినా... ఫ్యామిలీ ఫంక్షన్ అయినా... పైనుంచి తీసిన వీడియోలు చూస్తేనే అసలు కిక్! అయితే ఆ షాట్స్ కోసం పెద్ద డ్రోన్ ను బ్యాగ్‌లో మోసుకెళ్లాల్సిన పని లేదు. ఈ ఫోల్డబుల్ డ్రోన్‌ను మడిచేస్తే మీ జేబులోనే ఇమిడిపోతుంది. బయటకు తీస్తే మాత్రం ఆకాశంలో ఎగిరే మీ పర్సనల్ కెమెరామ్యాన్ గా మారిపోతుంది. ఒక్క బటన్ తో టేకాఫ్, ఒక్క బటన్ తో ల్యాండింగ్.
కొత్తవాళ్లు కూడా భయపడకుండా సులభంగా ఎగరేయొచ్చు. హై క్వాలిటీ కెమెరాతో ఫోటోలు, వీడియోలు స్పష్టంగా రికార్డ్ అవుతాయి. ఫోన్‌తో నేరుగా కనెక్ట్ చేసుకుని లైవ్‌లోనే చూడొచ్చు. కెమెరా యాంగిల్‌ను కూడా అవసరానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. చేతితో సైగ చేస్తే సెల్ఫీ తీయడం, ఒకే ఎత్తులో స్థిరంగా ఎగరడం, గాలిలో 360 డిగ్రీల ఫ్లిప్స్ చేయడం వంటి ఫీచర్లు దీనిని మరింత సరదాగా మారుస్తాయి. ధర రూ. 1,500 మాత్రమే!


