బాత్‌రూమ్‌లో ఉండగా అమ్మాయిలను మేనేజర్ చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది
హైదరాబాద్: బాత్‌రూమ్‌లో ఉండగా అమ్మాయిలను మేనేజర్ చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ వికృతచేష్టలు ఎల్బీనగర్ బ్రాండ్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్నాయి. బ్రాండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐదుగురు అమ్మాయిలను బాత్ రూమ్ లో ఉండగా చిత్రీకరించి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఎల్పీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మేనేజర్ సాగర్ వేరే అమ్మాయితో వీడియోలు తీయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రీకరించిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది.