ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | man died in bus accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Feb 6 2015 4:22 PM | Updated on Sep 2 2017 8:54 PM

ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మలక్‌పేట ఏసీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగింది.

హైదరాబాద్ క్రైం: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మలక్‌పేట ఏసీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం జరిగింది. వివరాలు.. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నబీ సాహెబ్(55) సైదాబాద్‌లోని నూరో హైస్కూల్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. కాగా, శుక్రవారం రోడ్డు దాటుతుండగా ఇబ్రహీంపట్టణం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు(ఏపీ 29 పీఏ 0113) ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కర్ణాటకలోని సాహెబ్ బంధువులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement