'డబ్బులిస్తారా లేక దూకమంటారా..' | Man climbs Emami tower, threatens suicide | Sakshi
Sakshi News home page

'డబ్బులిస్తారా లేక దూకమంటారా..'

Jan 10 2016 2:02 PM | Updated on Sep 3 2017 3:26 PM

'డబ్బులిస్తారా లేక దూకమంటారా..'

'డబ్బులిస్తారా లేక దూకమంటారా..'

కూకట్‌పల్లి మెట్రో సమీపంలో ఉన్న ఇమామి టవర్స్ 17వ అంతస్తుపై నుంచి దూకుతానంటూ శ్రీనివాస్ అనే సివిల్ కాంట్రాక్టర్ ఆదివారం మధ్యాహ్నం హల్‌చల్ చేస్తున్నాడు.

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి మెట్రో సమీపంలో ఉన్న ఇమామి టవర్స్ 17వ అంతస్తుపై నుంచి దూకుతానంటూ  శ్రీనివాస్ అనే సివిల్ కాంట్రాక్టర్ ఆదివారం మధ్యాహ్నం హల్‌చల్ చేస్తున్నాడు. ఇమామి యాజమాన్యం తను   చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోవడమే దీనికి కారణమని చెబుతున్నాడు.

సమాచారం అందుకుని ఈ దృశ్యాలను చిత్రీకరించటానికి వెళ్లిన మీడియాపై యాజమాన్యం దాడికి యత్నించింది. శ్రీనివాస్ చర్యతో కుటుంబసభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. దాదాపు గంటసేపు అక్కడే ఉన్న శ్రీనివాస్..  యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో కిందకు దిగి వచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement