మా ఆయన మంచివాడు: మధుప్రియ | Madhu Priya and Srikanth views after Police Counselling | Sakshi
Sakshi News home page

మా ఆయన మంచివాడు: మధుప్రియ

Mar 13 2016 7:25 PM | Updated on Aug 21 2018 7:17 PM

మా ఆయన మంచివాడు: మధుప్రియ - Sakshi

మా ఆయన మంచివాడు: మధుప్రియ

గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వివాదం డ్రామాకు 24 గంటల తర్వాత తాత్కాలికంగా తెరపడింది.

హైదరాబాద్: గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వివాదం డ్రామాకు 24 గంటల తర్వాత తాత్కాలికంగా తెరపడింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకు పోలీసులు, మానసిక వైద్యుల సమక్షంలో 4 గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ అనంతరం ఇద్దరు ప్రస్తుతానికి రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. శ్రీకాంత్ కు అయిన గాయాల వివాదంపై మాట్లాడుతూ.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ కేసు ఉందని పేర్కొన్నారు.  మధుప్రియ, శ్రీకాంత్ పూర్తిగా రాజీకొస్తారని భావిస్తున్నారా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అది వారిద్దరికి సంబంధించిన వ్యవహారమని ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు.

రెండో కౌన్సెలింగ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సింగర్ మధుప్రియ చెప్పింది. అయితే, తనకు కొద్దిరోజుల సమయం కావాలని కోరినట్లు ఆమె పేర్కొంది. రెండో కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు తన తల్లితండ్రులతోనే ఉండబోతున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ తర్వాత శ్రీకాంత్ పై అభిప్రాయం అడగగా... 'హి ఈజ్ గుడ్' అంటూ మధుప్రియ చెప్పింది . మధుప్రియ వస్తానంటే తన ఇంటికి తీసుకెళ్లాడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని శ్రీకాంత్ అంటున్నాడు. అయితే, భవిష్యత్తులో ఆమె తల్లిదండ్రులు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని శ్రీకాంత్ చెప్పాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఒకరు మరొకరిపై కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. తనను వేధిస్తున్నాడని మధుప్రియ, తనపై దాడి చేశారని శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదులు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement