ప్రేమించకపోతే చంపేస్తా.... | love meif you have a no i will kill you | Sakshi
Sakshi News home page

ప్రేమించకపోతే చంపేస్తా....

Dec 25 2015 11:47 PM | Updated on Jul 26 2018 5:23 PM

ప్రేమించకపోతే చంపేస్తా.... - Sakshi

ప్రేమించకపోతే చంపేస్తా....

‘‘నన్ను ప్రేమించు...లేకపోతే చంపేస్తా’ అంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు వేధిస్తున్నాడు.

బాలికకు యువకుడి హెచ్చరిక
నిందితుడి అరెస్టు

 
బంజారాహిల్స్: ‘‘నన్ను ప్రేమించు...లేకపోతే చంపేస్తా’ అంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఓ యువకుడు వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీ సుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ నివాసి వల్లాల శేఖర్(19) తండ్రితో కలిసి స్థానికంగా స్క్రాప్ దుకా ణం నిర్వహిస్తున్నాడు. ఇదే బస్తీకి చెందిన విద్యార్థిని(14) జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో చదువుతోంది. ఆమెను శేఖర్ కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు. వారికంటే ముందుగానే వి ద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి చేరుకుం టుంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన శేఖర్ ఒకరోజు బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమె ఫొటోలు తీశాడు.

ప్రేమించకపోతే ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అతడి వేధింపు లు తాళలేక కొద్ది రోజులుగా కుమిలిపోతున్న బాలిక ఎట్టకేలకు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు శుక్రవారం కుమార్తెతో బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయించ గా..  నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement