ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, తక్షణమే దానిపై
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, తక్షణమే దానిపై న్యాయవిచారణకు ఆదేశించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మావోయిస్టుల సమస్యను ప్రభుత్వం శాం తిభద్రతల సమస్యగా మాత్రమే పరిగణించడం సరికాదని తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), జానకిరాములు(ఆర్‌ఎస్‌పీ), మురహరి(ఎస్‌యూసీఐ-సీ), కె.గోవర్దన్(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), భూతం వీరన్న(సీపీఐ-ఎంఎల్), ఎన్.మూర్తి(లిబరేషన్), బం డా సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్)లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధం గా చూసినంత కాలం సమస్య పరిష్కారం కాదని సూచించారు.