కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత సంవత్సరంలో నీటి వినియోగానికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, ముసాయిదాపై చర్చిస్తారు.
తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుంది. బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించే అవకాశముంది. పోలవరం, పట్టిసీమ, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అధికారులు కేంద్రంతో చర్చించనున్నారు.