పోరాడితేనే సమస్యలకు పరిష్కారం | kodandaram about trs | Sakshi
Sakshi News home page

పోరాడితేనే సమస్యలకు పరిష్కారం

Jul 8 2017 2:19 AM | Updated on Jul 29 2019 2:51 PM

పోరాడితేనే సమస్యలకు పరిష్కారం - Sakshi

పోరాడితేనే సమస్యలకు పరిష్కారం

పోరాడితేనే పాలకులు సమస్యలు పరిష్కరిస్తారని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు.

నేటి నుంచి సిరిసిల్ల జిల్లాలో రెండో విడత యాత్ర: కోదండరాం
సాక్షి, హైదరాబాద్‌: పోరాడితేనే పాలకులు సమస్యలు పరిష్కరిస్తారని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం నుంచి 10వ తేదీ వరకు సిరిసిల్ల రాజన్న జిల్లాలో అమర వీరుల స్ఫూర్తి రెండో విడత యాత్ర జరుగుతుందన్నారు.

ఉద్యమ ఆకాంక్షలను పట్టించుకోకుండా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం స్వార్థం కోసం పనిచేస్తోందని విమర్శించారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక దందా నడుస్తోందన్నారు. ఎస్సై పరీక్షలు జరిగి ఏడు నెలలు దాటినా ఫలితాలను వెల్లడించడం లేదన్నారు. డిండి విషయంలో జేఏసీ అభిప్రాయాన్ని వినకుండా కొందరు రిటైర్డు ఇంజనీర్లు, టీఆర్‌ఎస్‌ నేతలు అసహనానికిలోనై మాట్లాడుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement