తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్.. చెత్త హైదరాబాద్' లా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్.. చెత్త హైదరాబాద్' లా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఇంజనీరింగ్ కాలేజీపై కక్ష సాధింపు, ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించడానికే ఈ వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు.
'స్వచ్ఛ హైదరాబాద్' పేరుతో చెత్త హైదరాబాద్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇస్తోన్న ఇఫ్తార్ విందు బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. హిందువులపై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.