ఖమ్మంలో 15న సీఎం కేసీఆర్ పర్యటన | KCR tour on the 15th in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో 15న సీఎం కేసీఆర్ పర్యటన

Feb 12 2016 8:28 AM | Updated on Sep 4 2018 5:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది. 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఖమ్మం చేరుకుంటారు. అనంతరం ఖమ్మం పట్టణంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
 అదే రోజు రాత్రి ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌజ్‌లో బసచేస్తారు. మరుసటి రోజు ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని రామాలయంను సందర్శిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో ఓ పబ్లిక్ మీటింగ్‌కి హాజరవుతారు. తిరుమలాయపాలెం నుంచి టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామానికి హెలికాప్టర్‌లో చేరుకుని రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement