'సన్న సీఎంని కాబట్టి.. సన్నబియ్యం ఇస్తున్నా' | KCR makes fun of giving rice for hostels | Sakshi
Sakshi News home page

'సన్న సీఎంని కాబట్టి.. సన్నబియ్యం ఇస్తున్నా'

Feb 16 2016 6:23 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకంగా తనపై తానే సెటైర్‌ వేసుకున్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై తానే సెటైర్‌ వేసుకున్నారు. తాను 'సన్న ముఖ్యమంత్రిని కాబట్టి.. హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నా' అంటూ నవ్వులు పూయించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హాస్టళ్లలో సన్నబియ్యం ఇస్తున్న విషయం పీడీఎస్‌యూ వాళ్లకు తెలియదా? అని నవ్వుతూ చురుకలు అంటించారు.

చిల్లర రాజకీయాలు చేసేవాళ్లు పద్ధతి మార్చుకోవాలని హితవు పలకారు. సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా 24 మండలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నాలుగేళ్లలో సాగునీటి రంగానికి రూ. లక్ష 25వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని కేసీఆర్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement