కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున పీఠాధిపతులను ఆహ్వానించాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు. పీఠాధిపతులు, వేద పండితుల ద్వారా పుష్కరాల నిర్వహణ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.