పాలమూరు జిల్లాకు బయల్దేరిన కేసీఆర్ | KCR goes for krishna pushkaralu in mahabubnagar district | Sakshi
Sakshi News home page

పాలమూరు జిల్లాకు బయల్దేరిన కేసీఆర్

Aug 11 2016 3:02 PM | Updated on Oct 8 2018 5:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాకు బయల్దేరారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాకు బయల్దేరారు. రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలను ఆయన ప్రారంభించనున్నారు. కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా అలంపూర్కు చేరుకుంటారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి అలంపూర్లోని టూరిజం అతిథిగృహంలో బస చేస్తారు.

శుక్రవారం ఉదయం గొందిమళ్లలో ఏర్పాటు చేసిన వీఐపీ పుష్కర ఘాట్లో స్నానమాచరించి వేదపండితులు ఏర్పాటు చేసి ప్రత్యేక హారతిలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం వేదపండితుల ఆశ్వీరచనం తీసుకుంటారు. అనంతరం జోగులాంబ దేవాలయాన్ని సందర్శించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement