ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్‌: జగ్గారెడ్డి | Jaya Prakash Reddy commented on Balka Suman | Sakshi
Sakshi News home page

ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్‌: జగ్గారెడ్డి

Jun 4 2017 1:03 AM | Updated on Sep 5 2017 12:44 PM

ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్‌: జగ్గారెడ్డి

ఓయూలో హత్యలు చేసిన బాల్క సుమన్‌: జగ్గారెడ్డి

తెలంగాణ ఉద్య మం ముసుగులో ఎంపీ బాల్క సుమన్‌ విద్యార్థులను హత్య చేశారని ప్రభుత్వ మాజీ విప్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్య మం ముసుగులో ఎంపీ బాల్క సుమన్‌ విద్యార్థులను హత్య చేశారని ప్రభుత్వ మాజీ విప్‌ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్యల వివరాలను బయటపెడతానన్నారు.

‘నాకు గుండు కొట్టిస్తానని సుమన్‌ అంటున్నడు. దమ్ముంటే నన్ను ముట్టుకో. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులే సంగారెడ్డికి రావాలంటే భయపడతరు’ అని జగ్గారెడ్డి అన్నారు. సుమన్‌కు దమ్ముంటే ఓయూ లో సీఎంతో సభ పెట్టించాలని సవాల్‌ చేశారు. హైదరాబాద్‌లోనూ సుమన్‌ను తిరక్కుండా చేయగలనన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement