ఐపీఎస్‌లు x రాజకీయవేత్తలు! | IPS x politicians! | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌లు x రాజకీయవేత్తలు!

Jan 30 2017 12:42 AM | Updated on Sep 22 2018 8:25 PM

ఐపీఎస్‌లు x రాజకీయవేత్తలు! - Sakshi

ఐపీఎస్‌లు x రాజకీయవేత్తలు!

పోలీసుశాఖలో ఐపీఎస్‌లు, రాజకీయ నాయకులకు మధ్య యుద్ధం నడుస్తోంది! కానిస్టేబుళ్ల బదిలీ నుంచి డీఎస్పీల బదిలీ వరకు అంతా పొలిటీషి యన్స్‌ చెప్తున్నట్టుగానే సాగుతోంది!!

  • పోలీసుల బదిలీల్లో ఉన్నతాధికారులపై నేతల ఒత్తిళ్లు, బెదిరింపులు
  • ఇటీవల జరిగిన డీఎస్పీ బదిలీల్లో బయటపడ్డ వ్యవహారం
  • ఏళ్ల నుంచి వరంగల్లోనే ‘ఆ నలుగురి’ ఉద్యోగం
  • ఉన్నతాధికారులు బదిలీచేసినా..మళ్లీ అక్కడికే పోస్టింగ్‌
  • ఆరోపణలెదుర్కుంటున్న వారిని సస్పెండ్‌ చేయలేని దుస్థితి
  • సాక్షి, హైదరాబాద్‌: పోలీసుశాఖలో ఐపీఎస్‌లు, రాజకీయ నాయకులకు మధ్య యుద్ధం నడుస్తోంది! కానిస్టేబుళ్ల బదిలీ నుంచి డీఎస్పీల బదిలీ వరకు అంతా పొలిటీషి యన్స్‌ చెప్తున్నట్టుగానే సాగుతోంది!! చివరకు అవినీతి ఆరోపణలెదుర్కుం టున్న ఎస్‌ఐలను సైతం సస్పెండ్‌ చేయలేని దుస్థితిలో ఐపీఎస్‌ అధికారులున్నారని పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.

    మళ్లీ అక్కడికే చేరిన ఆ నలుగురు...
    ఇటీవల జరిగిన కొంత మంది డీఎస్పీల బదిలీల్లో రాజకీయ నేతల ఒత్తిళ్లపై ఉన్న తాధికారులు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. వరంగల్‌ జిల్లాలోనే 15 ఏళ్లుగా పాతుకుపోయిన నలుగురు డీఎస్పీలను వివిధ ప్రాంతాలకు డీజీపీ బదిలీచేసినా.. నాలుగు రోజుల్లో ఒక డీఎస్పీ, నెల వ్యవధి లోనే మరో ఇద్దరు, పది రోజుల వ్యవధిలో మరో డీఎస్పీ వరంగల్, ఆ పక్కనే ఉన్న సబ్‌ డివిజన్లను దక్కించుకొని ఉన్నతాధికారులకు సవాల్‌ విసిరారు. ఈ నలుగురికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అండ ఉండటం వల్లే తిరిగి పోస్టింగులు చేజిక్కించుకున్నారని వరంగల్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. సంబం ధిత అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మంత్రులకు ఉన్నతాధికారులు చెప్పినా వినిపించుకోలే దని తెలిసింది. వికారాబాద్‌ జిల్లాకు ఇటీవలే బదిలీ అయిన ఓ డీఎస్పీ ఏకంగా తాను రూ. 10 లక్షలు పెట్టి వచ్చానని, మూడు నెలల్లో అవి వసూలు చేసుకోవాలని ఎస్‌ఐలకు అల్టిమేటం ఇవ్వడం అధికారులను కంగు తినిపించింది.

    ఆ కేసుల్లోనూ వారి పెత్తనమే...
    కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య కేసులో ఇప్పటికీ ఆరోపణ లెదుర్కొం టున్న అధికారులపై చర్యలు తీసుకోక పోవ డం వెనక నేతల ఒత్తిడే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో ఎస్‌ఐ ఆత్మ హత్య వెనుక ఓ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నాడని విచారణ లో తేలినా చర్యలు తీసుకోలేకపోవ డానికి మంత్రి అండదండలే కారణమని అధి కారులే వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి లోని ఓ మహిళ హత్య కేసును తారు మారు చేసిన ఇన్‌స్పెక్టర్‌ను కూడా ఇప్పటి వరకు సస్పెండ్‌ చేయలేదంటే కారణం సంబంధిత ప్రజాప్రతినిధులే అని ఐపీఎస్‌ అధికారులు బాహాటంగానే పేర్కొంటున్నారు.

    సర్క్యులర్‌.. జాన్తానై...
    ఏసీబీ కేసులు, ఆరోపణలు రుజువైన అధికారులెవరికీ శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వవద్దని రాష్ట్ర ఏర్పాటు సమయంలో పోలీసు శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. దీన్ని ఆరు నెలల కిందటి వరకు ఐపీఎస్‌ అధికారులు అమలు చేశారు. అయితే ఈ విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ పెద్దల వద్ద ఫిర్యాదు చేయడంతో అడిగిన వారికి అడిగిన అధికారిని ఇవ్వాల్సిందేనని హుకుం జారీ అయ్యింది. ఫలితంగా ఎస్‌ఐ పోస్టింగ్‌కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు, సీఐ పోస్టింగ్‌కు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు, డీఎస్పీ పోస్టింగ్‌లకు రూ. 20 లక్షల వరకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వసూలు చేసినట్లు తెలిసింది. కొంతమంది అధికారులు ఎమ్మెల్యేలకు ఇన్నోవా కార్లు కొనిచ్చినట్టు సమాచారం. ఇలా నాయకుల పెత్తనంతో 42 మంది అవినీతి అధికారులకు పోస్టింగులు ఇచ్చినట్టు ఉన్నతాధికారులు రికార్డుల్లో నోట్‌ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement