కూకట్‌పల్లిలో యువతి ఆత్మహత్య | intermediate student commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో యువతి ఆత్మహత్య

Jan 11 2018 11:44 AM | Updated on Nov 6 2018 7:53 PM

నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీ నిలయం అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న రేష్మి (18) అనే యువతి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

అయితే మతిస్థిమితం లేకపోడం వల్లే రేష్మి అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement