క్రికెట్ యుద్ధం...సిటీ సిద్ధం | india vs pakisthan world cup match today | Sakshi
Sakshi News home page

క్రికెట్ యుద్ధం...సిటీ సిద్ధం

Feb 14 2015 11:50 PM | Updated on Sep 2 2017 9:19 PM

క్రికెట్ యుద్ధం...సిటీ సిద్ధం

క్రికెట్ యుద్ధం...సిటీ సిద్ధం

1..2..3 కౌంట్‌డౌన్ మొదలైంది..కొద్ది గంటల్లో ఇండో పాక్ మధ్య క్రికెట్ యుద్ధం ప్రారంభం కానుంది.

1..2..3 కౌంట్‌డౌన్ మొదలైంది..కొద్ది గంటల్లో ఇండో పాక్ మధ్య క్రికెట్ యుద్ధం ప్రారంభం కానుంది. సిటీలో సర్వత్రా ఉత్కంఠ.. క్రికెట్ ప్రేమికుల్లో నరాలు తెగేటెన్షన్..అంతటా అటెన్షన్.. నగరవాసుల చూపంతా అడిలైడ్ వైపే..ప్రత్యేక ఏర్పాట్లతో వీకెండ్ హోరెత్తిపోనుంది..  నెలకొంది. హోటళ్లు, మాల్స్‌తో పాటు వివాహాలు జరుగుతున్న ఫంక్షన్‌హాళ్లలోనూ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.

పాక్‌పై ఘనం విజయం సాధించి జైత్రయాత్రకు స్వాగతం పలకాలని సిటీ వాసులు ఆకాంక్షిస్తున్నారు. గత వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై సాధించిన ఘన విజయాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు. భారత్ -పాక్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్‌లు కూడా జరిగే అవకాశం ఉండడంతో పోలీస్‌లు సైతం నిఘా పెట్టారు.

భారీ బ్యాట్

ప్రపంచకప్ సందర్భంగా ఆంగ్లోఫిల్ బిజినెస్ స్కూలు సిబ్బంది 35 అడుగులు భారీ బ్యాట్‌ను తయారు చేయించారు. దానిని శనివారం ప్రదర్శించారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీ నుంచి మైండ్ స్పేస్ వరకు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30వేల మంది క్రికెట్ అభిమానులు బ్యాట్‌పై సంతకాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement