స్నేహితురాలితో అసభ్య ప్రవర్తన | indecent behavior with a friend | Sakshi
Sakshi News home page

స్నేహితురాలితో అసభ్య ప్రవర్తన

Aug 10 2015 11:58 PM | Updated on May 25 2018 2:06 PM

తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు.

ఎంబీఏ విద్యార్థి అరెస్టు
 
బంజారాహిల్స్: తాగిన మైకంలో స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎంబీఏ విద్యార్థి కటకటాల పాలయ్యాడు.  బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్‌నగర్  నివాసి పవన్‌కుమార్ (23)ఎంబీఏ చదువుతున్నాడు.  బోనాల సంద ర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు.

మద్యం మత్తులో ఉన్న పవన్ సోమవారం తె ల్లవారుజామున 4 గంటలకు శాలివాహననగర్‌లో నివసించే తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి స్నేహితురాలితో అసభ్యంగా   ప్రవర్తించాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement