కార్మిక కుటుంబాల్లో పదోతరగతి, ఆపైన చదువుతున్న పిల్లలకు ఉపకారవేతనాలు ఇవ్వాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి నిర్ణయించింది.
ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక కుటుంబాల్లో పదోతరగతి, ఆపైన చదువుతున్న పిల్లలకు ఉపకారవేతనాలు ఇవ్వాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి నిర్ణయించింది. ప్రతిభ ఆధారంగా వీటిని మంజూరు చేయనుంది. ఇందులోభాగంగా 2015–16 విద్యాసంవత్సరంలో పదోతరగతి, ఆపై చదువులు పూర్తి చేసిన వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. 2015–16 విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.వెయ్యి, పాలిటెక్నిక్ కోర్సు చేసిన వారికి రూ.1,500, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారికి రూ.2వేల చొప్పున ఉపకారవేతనం ఇవ్వనుంది.
ఈమేరకు దరఖాస్తు ఫారాలు సహాయ కార్మిక కమిషనర్ (ఏసీఎల్) కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది. పూర్తిచేసిన దరఖాస్తులను వచ్చేనెల 28లోగా కార్మిక కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. ప్రతిభ ఆధారం గా అర్హులను గుర్తించి, మేడే నాటికి బ్యాంకు ఖాతాలో ఉపకారవేతన నిధులు జమచేయనున్నట్లు తెలంగాణ సంక్షేమ మండలి కార్యాలయం తెలిపింది.