పోలండ్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి.. | Hyderabad's boy married with a young woman in Poland | Sakshi
Sakshi News home page

పోలండ్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి..

Jan 30 2015 9:58 PM | Updated on Sep 2 2017 8:32 PM

పోలండ్ అమ్మాయి..  హైదరాబాద్ అబ్బాయి..

పోలండ్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి..

ఖండాతరాలు దాటిన ప్రేమ.. పెళ్ళికి దారి తీసింది. పోలండ్‌కు చెందిన యువతితో హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ వివాహం గురువారం మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగింది.

బంజారాహిల్స్: ఖండాతరాలు దాటిన ప్రేమ.. పెళ్ళికి దారి తీసింది. పోలండ్‌కు చెందిన యువతితో హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ వివాహం గురువారం మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగింది. లండన్‌లో ఉద్యోగం చేస్తున్న సుధాకర్‌కు తనతో పాటు పని చేస్తున్న మరియతో పరిచయం ఏర్పడింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, వివాహ నేపథ్యానికి ముగ్ధురాలైన మరియ తన పెళ్ళిని హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని నిశ్చయించుకొని ఆమేరకు ఇక్కడే పెళ్ళి చేసుకుంది. పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మరియ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

మెహిదీపట్నం చెందిన చెన్నూరి శ్రీనివాసులు, చెన్నూరి లక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్ తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. మూడు ముళ్లు.. ఏడు అడుగులు, తలంబ్రాలు.. వేదమంత్రాలు.. పెద్దల ఆశీస్సుల మధ్య ఇలా పెళ్ళి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మరియ తెలిపింది. పట్టుచీరలో ధగధగ మెరిసిపోతూ ఆమె సందడి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement