సింగర్ మధుప్రియ, శ్రీకాంత్లకు కౌన్సెలింగ్ | hyderabad Police Counselling to Singer Madhu Priya & Her Husband Srikanth | Sakshi
Sakshi News home page

సింగర్ మధుప్రియ, శ్రీకాంత్లకు కౌన్సెలింగ్

Mar 13 2016 4:45 PM | Updated on Sep 4 2018 5:07 PM

సింగర్ మధుప్రియ, శ్రీకాంత్లకు కౌన్సెలింగ్ - Sakshi

సింగర్ మధుప్రియ, శ్రీకాంత్లకు కౌన్సెలింగ్

సింగర్ మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్కు ఆదివారం మధ్యాహ్నం హుమయున్ నగర్ పోలీస్స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.

హైదరాబాద్: సింగర్ మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్కు ఆదివారం మధ్యాహ్నం హుమయున్ నగర్ పోలీస్స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.  పోలీసుల సమక్షంలో ఇద్దరికీ విడివిడిగా, కలిపి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి మాట్లాడారు.

పెళ్లి అయిన తర్వాత మూడు నెలలపాటు బాగానే చూసుకొన్న శ్రీకాంత్.. తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో పాటు ప్రతి రోజు తనను కొడుతున్నాడని సింగర్ మధుప్రియ ఆరోపణలు చేసింది. మధుప్రియ చేసిన ఆరోపణలు నిజమైతే తాను పీకను కోసుకుంటానని, ఉరిశిక్షకు సిద్ధమని, జైలుకు కూడా వెళ్తానని ఆమె భర్త శ్రీకాంత్ చెప్పాడు. ఆరు నెలల కిందట తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ మధుప్రియ.. తన భర్త శ్రీకాంత్ వేధిస్తున్నాడంటూ శనివారం రాత్రి హుమయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement